CTR: చిత్తూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదని స్థానికులు తెలిపారు. దీని వలన ట్రాఫిక్ నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. ఎవరైనా నాయకులు వెళ్లేటప్పుడు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు వాహనాల నియంత్రణ చేపడతారని, మిగిలిన సమయంలో అటువైపు కన్నెత్తి కూడా చూడరని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై దృష్టి సారించాలని వారు కోరారు.