ప్రకాశం: మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన యువకులు గణేష్, అబినాష్ మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న భౌతికకాయాలను సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, అధికారులు ఉన్నారు.