అన్నమయ్య: మంగళవారం ఉదయం సుండుపల్లి మండలం భాగంపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ గఫూర్ (65), షేక్ రహజాన్ (60) అనే భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హూటహూటిన స్థానికులు 108 సేవ ద్వారా వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు.