BDK: కారు ఇంజన్లో గంజాయి ప్యాకెట్లు రవాణా చేస్తున్న ముఠా మంగళవారం బయటపడింది. కారు ఇంజన్లో గంజాయి రవాణా చేస్తుండగా ఇంజన్ వేడికి మంటలు అంటుకోవడంతో ఆ కారును వాటర్ సర్వీసింగ్ సెంటర్కు తరలించారు. మంటలు అదుపు చేసే క్రమంలో బ్యానట్ ఓపెన్ చేయగా కాలుతున్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఖంగుతిన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్మగ్లర్లు పరారయ్యారు.