KDP: ముద్దనూరు మండలంలోని రైతులు తమ భూముల్లో భూసార పరీక్షలు చేసుకోవాలని ఇంఛార్జ్ డీడీఏ మద్దిపాటి నాగరాజు కోరారు. రాజుల గురువాయ పల్లె, పెనికిలపాడులో భూసార పరీక్ష ఫలితాలపై మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను వాడాలన్నారు. కాగా, అలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.