KMM: ఏదులాపురం మున్సిపాలిటీ నాయుడుపేటలో డ్రైనేజీ కాలువలు చెత్తాచెదారంతో నిండి ఉన్నాయని స్థానికులు తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో మురికి నీరు ముందుకు వెళ్లక నిల్వ ఉంటుందని వాపోయారు. దీని కారణంగా దోమలు పెరిగి అనారోగ్యం బారీన పడుతున్నామన్నారు. వర్షం పడ్డప్పుడు డ్రైనేజీ నీరు రోడ్డుపై చేరుతుందని వెల్లడించారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.