TG: కోదండరాం మద్దతుతో బీసీ బంద్ వంద శాతం సక్సెస్ అయినట్లే అనే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 18న బందుకు మద్దతిస్తామని కోదండరాం చెప్పడంతో.. ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కోదండరాం అని కొనియాడారు. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని వెల్లడించారు.