ATP: రాప్తాడు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఈలు, డీఈలు, ఏఈలతో MLA పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, సచివాలయాల నిర్మాణాల పురోగతిపై సమగ్ర చర్చ జరిగింది. రూ. 6కోట్లతో 22 బీటీ రోడ్ల పనులు పూర్తయ్యాయని, రూ. 22.80కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లలో 98% పూర్తయ్యాయని అధికారులు వివరించారు.