AP: పల్లె పండగ 2.0పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పల్లె పండగ విజయం స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఏపీ గ్రామీణ ముఖచిత్రం సంపూర్ణంగా మారేలా ప్రణాళికలు ఉండాలని దిశానిర్దేశం చేశారు.