NRML: జిల్లా డిఎల్పిఓ లింగయ్య మంగళవారం దిలావర్పూర్ మండలంలో పర్యటించారు. ముందుగా న్యూ లోలం గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం నర్సరీని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కంజర్ గ్రామంలో పర్యటించి గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు.