ప్రకాశం: ఈ నెల 16న పీఎం నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు తరలిరావాలని ఒంగోలు ఎమ్మెల్యే, డోన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం డోన్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త, నాయకులు బాధ్యతగా తీసుకుని సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్య ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.