MNCL: జన్నారం మండలంలోని కొత్తపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం మండల విద్యాధికారి (ఎంఈఓ) విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతులు, విద్యార్థులకు అందించే ఆహార మెనూ, వంటగది పరిశుభ్రత, అలాగే ఉపాధ్యాయుల హాజరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.