TG: ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో వెంగళరావు నగర్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల చివరి రోజు వరకు కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా మెరుగైన ఫలితాలు తీసుకురావాలన్నారు.