ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మ్యూజిక్ టెలివిజన్(MTV) బ్యాడ్ న్యూస్ చెప్పింది. తమ మ్యూజిక్ ఛానళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. MTV 80, MTV మ్యూజిక్, క్లబ్ MTV, MTV 90, MTV లైవ్ ఛానళ్లు DEC 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండవని తెలిపింది. వినోదాన్ని అందించడానికి ఎన్నో ఛానళ్లు, యాప్స్ రావడంతో MTV ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.