ASR: గుండె ఆగినప్పుడు మెదడు, అవయవాలకు రక్త ప్రసరణను నిర్వహించేందుకు సహాయపడే ప్రక్రియే సీపీఆర్ అని ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారి జీ.గౌరీ శంకరరావు అన్నారు. హుకుంపేట కేజీబీవీలో మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు భార్గవ్‌తో కలిసి విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. సీపీఆర్ అనేది అత్యవసర చికిత్స అన్నారు.