MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 11వ డివిజన్లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంగీకార్ – 2025 పీఎంఏవై (నగర) కార్యక్రమాన్ని కమిషనర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి,శక్తి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యం, పరిశుభ్రత, సుస్థిర, ఆరోగ్య జీవనంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.