కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ‘కాంతార 1’ మూవీ భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.675 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్ ‘బాహుబలి ది బిగినింగ్'(రూ.650కోట్లు)ను బీట్ చేసింది. దీంతో దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో 17వ సినిమాగా ఇది నిలిచింది. అంతేకాదు ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుకెక్కింది.