SKLM: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వలన నిరుపేద కుటుంబాల జీవితాలు పతనం అవుతాయని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇప్పటికే నిరుపేద కుటుంబాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేట్ హాస్పిటల్కు పోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.