HYD: గుడిమల్కాపూర్లోని గోల్డెన్ ప్యాలెస్ హోటల్లో కొనుగోలు చేసిన బిర్యానీ పార్సెల్లో బొద్దింక కనిపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న సోమాచారి అనే వ్యక్తి రూ. 650 చెల్లించి బిర్యానీ తీసుకెళ్లగా, అందులో బొద్దింకను చూసి ఫుడ్ సేఫ్టీ అధికారిణి రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. నాణ్యత లేని ఆహారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.