వెస్టిండీస్‌పై టీమిండియా టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా గెలిచిన టెస్టు సిరీస్‌తో వెస్టిండీస్‌పై భారత్ వరుసగా 10 సిరీస్‌లను కైవసం చేసుకుంది. అంతేకాకుండా, 2002 నుంచి ఇప్పటివరకు విండీస్‌తో ఆడిన టెస్టు మ్యాచ్‌లలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా, వరుసగా 27 విజయాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది.