హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నేడు ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది.