JGL: సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా అకస్మాత్తుగా గుండెపోటు బారిన పడిన వారి ప్రాణాలను కాపాడవచ్చునని, జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ పేర్కొన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా SKNR కళాశాల ఆవరణలోని వాకింగ్ సభ్యులకు సీపీఆర్ అవగాహన సదస్సుతో పాటు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.