VSP: శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికీ నేడు నిర్వహించిన అష్టదళ పద్మారాధన సేవలో ఉభయ దాతలు, వేదపండితులు, అర్చకులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో భక్తులు సుఖశాంతులు పొందాలని ప్రార్థనలు చేశారు. ఈ పవిత్ర సేవ ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ఆలయంలో నియమితంగా నిర్వహించబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.