PDPL: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం సిబ్బందికి ఉన్ని దుప్పట్లు, వూలెన్ జాకెట్లు, కాటన్ టీ-షర్ట్లు, రెయిన్ కోట్లు, హవర్ సాక్స్ పంపిణీ చేశారు. వాతావరణ మార్పులు, శ్రమతో కూడిన విధులను దృష్టిలో ఉంచుకుని ఈ దుస్తులను అందించామని తెలిపారు. ప్రతి పోలీసు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు.