HYD: దేశ నిర్మాణంలో రెండున్నర శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ‘సర్వే ఆఫ్ ఇండియా’కు సంబంధించి బిర్లా సైన్స్ మ్యూజియంలో ఒక ప్రత్యేక గ్యాలరీ ప్రారంభమైంది. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్ కుమార్ మక్వానా ప్రారంభించారు. సమగ్రభూములు, సరిహద్దుల లెక్కలు తేల్చే ఈ సంస్థకు చెందిన మొదటి రాజకీయ పటం(1963)తో పాటు, ప్రస్తుత రాష్ట్రాల మార్పులతో అభివృద్ధి చేసిన పటాలను ఉంచారు.