KNR: కరీంనగర్ భగత్ నగర్ జడ్పీ క్వార్టర్స్‌లోని హరి హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో 100 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడితో శబరిమలకు కాలినడకన మహాపాదయాత్రగా బయలుదేరారు. తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయ్యప్ప స్వాములు క్షేమంగా వెళ్లి శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకొని క్షేమంగా రావాలన్నారు.