వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ చివరి రోజు ఆటలో భారత్ లంచ్ విరామానికి ముందే విజయం సాధించింది. విజయానికి అవసరమైన 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ సులభంగా ఛేదించింది. రాహుల్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జురెల్ (6*)తో కలిసి జట్టును గెలిపించాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు, గిల్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యారు.