SRCL: తంగళ్లపల్లి గ్రామంలోని బత్తుల సారయ్య ఇంట్లో 4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని సేకరించి, ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నట్లు నిందితుడు అంగీకరించాడని ఎస్సై తెలిపారు.