AP: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. అలాగే.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు మోదీకి ఆహ్వానం అందించారు.