HNK: దుర్గంపేట దుర్గంపేట గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రామకృష్ణ ప్రజలను కోరారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.