BHNG: రాజపేట నుంచి ఆలేరుకు నూతన బస్సు సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. అడిగిన వెంటనే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బస్ సర్వీసును మంజూరు చేయించారు. రాజపేట నుంచి ఉదయం ఏడు గంటలకు బయలుదేరి పారుపల్లి, బొందుగుల, గోధుమ కుంట, సోమారం, లక్ష్మక్క పల్లి, దూది వెంకటాపురం, కొలనుపాక మీదుగా ఆలేరుకు వెళుతుందన్నారు. ప్రజలు నూతన బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలన్నారు.