ప్రకాశం: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కనిగిరిలో బుధవారం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక వైసీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు హాజరు కావాలన్నారు.