ASF: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మంగళవారం అధికారులు లబ్దిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందన్నారు. మండల కేంద్రాల్లో చేపట్టిన మోడల్ ఇళ్లు పూర్తిచేయాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద జిల్లాలో 2,167 మంది లబ్దిదారులను గుర్తించామని తెలిపారు.