MDCL: బాలానగర్ PS పరిధిలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లోని పద్మారావునగర్ పేజ్-1లో నివాసముంటున్న చల్లారి సాయిలక్ష్మి (27)తన ఇద్దరు కవల పిల్లలు.. చేతన్ కార్తికేయ (2), లాస్యత వల్లి (2)లను చంపి.. తాను కూడా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.