GNTR: తెనాలిలో నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. త్రీ టౌన్ పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి రెండవ రోజు కూడా వాహనాల తనిఖీలు చేపట్టారు. పాత బస్టాండ్ పెట్రోల్ బంక్ వద్ద ఎస్ఐ కరిముల్లా సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సెల్ ఫోన్, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడ్ వాహనాలను గుర్తించి పెనాల్టీలు విధించారు.