ప్రకాశం: వెలిగండ్లలో సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాతపూడి సురేశ్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తులు తినడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా కాయగూరలు పండించాలన్నారు.