AKP: ప్రయాణికుల సౌకర్యార్థం అనకాపల్లి నుంచి నాందేడ్ కు వారానికి ఒకసారి ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ప్రతి మంగళవారం నాందేడ్ నుంచి ఈ రైలు బయలుదేరి బుధవారం ఉదయం పది గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. అలాగే ప్రతి బుధవారం అనకాపల్లి నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు నాందేడ్ బయలుదేరి వెళుతుంది.