Bollywood TV actress Dolly Sohi dies of cervical cancer
Dolly Sohi: బాలీవుడ్ టీవీ నటి డాలీ సోహీ (Dolly Sohi) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మృతి చెందారు. ఈ 47 ఏళ్ల నటి మరణ వార్త తెలిసిన బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. గత కొంత కాలంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (Cervical Cancer)తో డాలీ బాధపడుతున్నారు. నవీ ముంబై (Navi Mumbai)లోని అపోలో ఆసుపత్రి (Apollo Hospital)లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణిించారు. ఇదే విషాదకరమైన వార్త అంటే తన సోదరి అమన్‌దీప్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని డాలీ కుటుంబ సభ్యులు తెలియజేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం కుటుంబంలో తీరని దు:ఖాన్ని నింపింది. విషయం తెలిసిన పలువురు ప్రముఖులు తమ కుటుంబానికి వారి సానుభూతిని తెలుపుతున్నారు.
“డాలీ ఇక లేరు. ఆమె గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు అది ఆమె ఊపిరితిత్తులకు వ్యాపించింది. పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో గురువారం రాత్రి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.00 గంటలకు అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అని డాలీ సోదరుడు మన్‌ప్రీత్ వెల్లడించారు. అదేవిధంగా మరో సోదరి అమన్‌దీప్ కామెర్ల కారణంగా డీవై పాటిల్ ఆసుపత్రిలో గురువారం మరణించినట్లు తెలిపారు. ఇదే వ్యాధిపై ప్రముఖ నటి పూనమ్ పాండే ఓ వివాదస్పదమైన చర్యకు పాలుపడింది. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌తో తాను మరణించినట్లు ప్రాంక్ చేసింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న గర్భాయ కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంతటి రిస్క్ తీసుకుంది.