హనుమాన్ సినిమా రిలీజ్ అయి రెండు నెలలు కావొస్తున్న ఇప్పటికీ ఓటిటిలోకి రాలేదు. అదిగో ఇదిగో అనడమే తప్ప ఓటిటి అప్డేట్ మాత్రం రావడం లేదు. లేటెస్ట్గా హనుమాన్ ఓటిటి లవర్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ.. సంక్రాంతి హిట్‌గా నిలిచింది. మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వంటి సినిమాలతో పోటీ పడి మరీ.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోయిన ఆడియెన్స్.. ఓటిటి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హనుమాన్ ఓటిటి డేట్ గురించి చర్చ జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరిలోనే ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. ఆ తర్వాత మార్చి 1న వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు మరో డేట్ లాక్ చేశారు.
హనుమాన్ ఓటిటి హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది. దీంతో మార్చి 8 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చినట్టుగా ఈ మధ్య టాక్ నడిచింది. కానీ ఇప్పుడు తీరా సమయం దగ్గర పడ్డా కూడా జీ5 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ జీ 5 సోషల్ మీడియా అకౌంట్‌కి ట్యాగ్ చేసి అడిగాడు. దీనికి జీ5 సంస్థ రిప్లే ఇస్తూ.. ఈ అంశానికి సంబంధించి మాకు ఎలాంటి అప్డేట్ లేదు, మా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని ఫాలో అవుతూ ఉండండి.. అప్డేట్ వచ్చినప్పుడు ఇస్తాం.. అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో హనుమాన్ ఓటిటిలోకి ఇప్పట్లో కష్టమే అంటున్నారు. లేదంటే.. సైలెంట్‌గా షాక్ ఇచ్చేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. ఓటిటి ఎంట్రీ ఎప్పుడుంటుందో చూడాలి.