జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా దేవర. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు అంతకుమించి అనేలా ఉన్నాయి. కానీ దేవర కోసం వెయిటింగ్ తప్పదంటున్నారు.
Devara' waiting is inevitable.. Teaser release just then?
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా పై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నిజానికైతే.. ఈ పాటికే దేవర షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఓ రేంజ్లో జరుగుతు ఉండాల్సింది. కానీ అనుకోకుండా విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు షూటింగ్లో ప్రమాదం జరగడంతో షూటింగ్ డిలే అయింది. అలాగే.. సమ్మర్లో ఏపి ఎలక్షన్స్ కారణంగా ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయింది దేవర. దీంతో ఇప్పట్లో దేవర నుంచి పెద్దగా అప్డేట్స్ బయటికొచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పటి వరకు దేవర నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌తో పాటు ఓ గ్లింప్స్ రిలీజ్ అయింది. పార్ట్ 1 గ్లింప్స్ టైగర్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. దీంతో నెక్స్ట్ దేవర పార్ట్ 1 టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
కానీ ఇప్పట్లో దేవర అప్డేట్ ఏమి లేదని అంటున్నారు. ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ నాడు సాలిడ్ ట్రీట్ ఉండే ఛాన్స్ ఉంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా జరగనున్నాయి. అదే రోజు దేవర నుంచి సాంగ్ లేదా టీజర్ బయటికి రానుందని అంటున్నారు. అప్పటి వరకు దేవర నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉండవట. ఏదైనా ఉంటే.. సినిమాలో నటిస్తున్న స్టార్ క్యాస్టింగ్ బర్త్ డే నాడు స్పెషల్ విషెష్ పోస్టర్స్ మాత్రమే ఉంటాయి. రీసెంట్గా జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా తంగం నుంచి ఓ ఫ్రెష్ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి.. దేవర నెక్స్ట్ సాలిడ్ అప్డేట్ కావాలంటే.. ఎన్టీఆర్ బర్త్ డే వరకు వెయిట్ చేయాల్సిందే.