ASR: ఈనెల 17వ తేదీ నుంచి ఎస్ జీఎఫ్ డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. అండర్ 14, 17 బాలుర, బాలికలకు 17వ తేదీన వాలీబాల్, చెస్, 18న ఖోఖో, యోగా, 21వ తేదీన కబడ్డీ, షటిల్, 22న అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయన్నారు. ఇటీవల మండల స్థాయి, డివిజన్ స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.