GNTR: అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు ఉండరాదని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాలుపై సంబంధిత అధికారులతో మంగళవారం టెలి కాన్ఫరెన్స్‌ను కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వలు, రవాణా సందర్భాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.