WGL: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కొండా దంపతుల పంతం మారదు. గతంలో నమ్మిన వారి కోసం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన వారు, బీఆర్ఎస్ టికెట్ ప్రకటించకపోవడంతో ఆ పార్టీకి ఎదురుతిరిగారు. తాజాగా, తమ శాఖలో మరొకరి జోక్యాన్ని సహించలేక తోటి మంత్రిపై కొండా దంపతులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచలనాలతో వార్తల్లో నిలవడం వారి ప్రత్యేకతగా కొనసాగుతోంది.