SRPT: మునగాల మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ, సూర్యపేట, హైదరాబాద్ వైపు వెళ్లేందుకు నిరీక్షించే ప్రజలు ఎండ, వానకు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారిపై తక్షణమే షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.