KMM: చింతకాని మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమలాపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్ ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. BRS పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు.