KRNL: పెద్దకడబూరు మండలం కంబళదిన్నె MPP పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. పాఠశాలలో దాదాపు 100 విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటం వల్ల పిల్లల చదువులు ఏమాత్రం మెరుగుపడటం లేదని వాపోయారు. ఇటీవల ప్రకటించిన డిఎస్సీ పోస్టుల్లో కుడా తమ పాఠశాలకు ఒక్కరినీ కూడా కేటాయించలేదన్నారు. 1+4 విధానంలో తమకు బోధన అందించాలని కోరారు.