ADB: గుడిహత్నూర్లో మంగళవారం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో వర్షం కురిసింది. అంతకుముందు ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మండల కేంద్రంతో పాటు కొల్హరి, ఇన్కార్ గూడ, ఉమ్రి తదితర పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ వర్షాలకు పంట నష్టం జరుగుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు.