NDL: కొత్తపల్లి మండలం ముసలిమడుగు, శివపురం గ్రామాలలో ఇవాళ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో శివపురం గ్రామంలో ర్యాలీ చేశారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు సూపర్వైజర్ నాగేశ్వరమ్మ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.