కోనసీమ: జిల్లాలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని కలెక్టర్ మహేశ్ కుమార్ చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని 23 చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. సంఘాలకు రావలసిన బకాయిల చెల్లింపులపై కూడా దిశానిర్దేశం చేశారు.