GDWL: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేదల పాలిట వరం లాంటిదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలంలోని 16 మంది లబ్ధిదారులకు ఇవాళ క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమంపై దృష్టి పెట్టారని, ఆరోగ్యశ్రీ స్థాయిని పెంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు.